Wednesday, January 22, 2025

కేవైసి.. అప్‌డేట్ జర జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

Be careful to KYC update

ఫోన్లు చేస్తున్న సైబర్ ఛీటర్లు
స్పందించవద్దని కోరుతున్న బ్యాంకర్లు
సైబర్ దొంగల రోజుకో కొత్త అవతారం
లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న బాధితులు

హైదరాబాద్: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకుల డబ్బులను దోచుకుంటున్నారు. గతంలో బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్లు చేసి ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని చెప్పి వారి నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకునేవారు. వీటిని నమ్మిన వారి నుంచి వివరాలు తీసుకున్న తర్వాత వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం చేసేవారు. ఇలాంటి బాధితుల్లో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. మోసపోయిన తర్వాత బాధితులు బ్యాంక్ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ అధికారులు, పోలీసులు ప్రజల్లో విస్కృతంగా ప్రచారం కల్పించడంతో చాలామంది సైబర్ నేరస్థులు ఆటలు సాగడంలేదు. ఫోన్లు చేసినా కూడా బ్యాంక్ ఖాతాదారులు వివరాలు చెప్పడంలేదు. హిందీలో మాట్లాడితే బ్యాంక్ ఖాతాదారులు కనిపెడుతున్నారని తెలుసుకున్న సైబర్ నేరస్థులు స్థానిక భాషను కొద్దిగా నేర్చుకుని మాట్లాడేవారు.

తామకు తెలిసిన భాషలో మాట్లాడడంతో బాధితులు నిజంగానే బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని నమ్మి వివరాలు చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే ఖాతా నుంచి విత్‌డ్రా చేసినట్లు వచ్చేది. ఈ విధంగా చాలామంది బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి బాధితులకు రావడం అసాధ్యంగా మారింది. వినియోగదారులు వివిధ రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో వాటికి సంబంధించిన కెవైసిని అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. ప్రజలు యూపిఐ యాప్‌లు ఎక్కువగా వినియోగిస్తుండడంతో వాటిని సైబర్ నేరస్థులు టార్గెట్ చేశారు. యూపిఐ పేమెంట్ యాప్‌లకు తప్పనిసరిగా కెవైసి అప్‌డేట్ చేయాలనే నిబంధన ఉండడంతో దానిని సైబర్ నేరస్థులు ఉపయోగించుకుని లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఎక్కువగా వస్తున్నాయి. కూకట్‌పల్లికి చెందిన యువకుడు పేటిఎం కెవైసి పూర్తి చేయాలని లేకుంటే సస్పెండ్ చేస్తామని ఫోన్ చేసి చెప్పారు.

ఆందోళన చెందిన బాధితుడు వెంటనే సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేశాడు. క్విక్ సఫోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రూ.1పంపించాడు. తర్వాత కొద్ది సేపటికి రూ.90,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో బాధితుడు తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి పేటిఎం కెవైసిని పూర్తి చేయడంతో సైబర్ దొంగలు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.59,999 కొట్టేశారు. బాలానగర్‌కు చెందిన మస్కూరి మాధవికి పేటిఎం కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్, ఫోన్ చేయడంతో క్విక్ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకుని సైబర్ నేరస్థులు చెప్పినట్లు రూ.10 వారికి పంపించింది. కొద్ది సమయం తర్వాత వారు బాధితురాలి ఖాతాను హ్యాక్ చేసి రూ.69,000ను విత్‌డ్రా చేశారు.

రెండేళ్ల కోసారి కేవైసి ఇవ్వాలి….
వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండేళ్ల కోసారి కెవైసి అప్‌డేట్ చేస్తుంది దానికి బ్యాంక్‌కు వచ్చి ఫొటో, గుర్తింపు కార్డులు ఇచ్చి వెళ్లాలని ఫోన్ చేసి చెబుతారు. లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ ఉన్న మొబైల్ మెసేజ్ పంపిస్తారు, తప్ప ఎలాంటి లింకులు పంపించరు. దీనిని చూసి బ్యాంక్ ఖాతాదారుడు స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి దరఖాస్తు తీసుకుని దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్‌లను, ఖాతా నంబర్, ఫోటోను ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బ్యాంక్ కేవైసి అప్‌డేట్ సదుపాయం ఇప్పటి వరకు లేదు, కాబట్టి బ్యాంక్ అధికారులు అడిగే అవకాశంలేదు. ఈ విషయం తెలియని బాధితులు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేస్తూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News