Monday, January 20, 2025

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:మఠంపల్లి మండల ప్రభుత్వ వైద్యశాలను ఎంపీపీ ముడావత్ పార్వతి కొండానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు వైద్యశాలను సందర్శించి రికార్డులను,వైరాలజీ ల్యాబ్ పరిశీలించి దావఖానాలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈసందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

చౌటపల్లి చెరువు పరిశీలన.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలుగు పోస్తున్న చౌటపల్లి చెరువును ఎంపీపీ ముడావత్ పార్వతి కొండానాయక్ పరిశీలించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమెవెంట ఎంపీడీవో జానకిరాములు, ఎంపీవో ఆంజనేయులు,చౌటపల్లి సర్పంచ్ కృష్ణవేణి నరేష్,కార్యదర్శి కవిత తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News