Thursday, January 23, 2025

నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గొర్రెలకు వచ్చే వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని గొర్రెల కాపరుల ఉమ్మడి జిల్లా చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, అర్బన్ ఎంపీపీ సవితా ప్రవీణ్‌రెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి జగత్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని గొర్రెల హాస్టల్‌లో నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పశువుల కోసం ప్రధానంగా గొర్రెల కాపరుల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందన్నారు.

అందులో భాగంగానే సంవత్సరానికి మూడు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు ఎనిమిది లక్షల గొర్రెలు, ఒక లక్షా ఎనబై వేల మేకలు ఉన్నాయని అందరు ఖఛ్చితంగా వేయించుకొని పశు సంపదను పెంచుకోవాలన్నారు. నట్టల వలన ఇతర వ్యాధుల వలన గొర్రెలకు వచ్చే సమస్యలను వాటి నివారణ మార్గాలను గొర్రెల కాపరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడి సత్యపాల్‌రెడ్డి, మండల పశు వైద్యాధికారులు చతుర్వేది, వేణుగోపాల్, పిఎసిఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్, యాదవ సంఘం అద్యక్షులు మామిండ్ల ఐలయ్య, యాదవ్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, డైరెక్టర్ పాతుకుల వెంకటేశ్ యాదవ్ వార్డు సభ్యులు చింతలకుమార్ యాదవ్, మఠం రాజు యాదవ్, జేపి, పయ్యావుల రమేశ్, చింతల మల్లేశం, జంపెల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News