Saturday, January 11, 2025

ఎన్నికలకు సిద్దం కండి: పవన్‌కల్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కు సిద్ధంగా ఉండాల ని తెలంగాణ నేతల కు పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ లోనూ వారాహి యాత్ర ఉంటుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం అంటూ 26 నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇంచార్జులుగా ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించారు. అభ్యర్ధుల పేర్లతో పాటు వారి నియోజకవర్గాలను ప్రకటించారు. ఇందులో వేమూరి శంకర్ గౌడ్ కు – కూకట్ పల్లి, పొన్నూరు లక్ష్మి యి శిరీష -కు ఎల్బీనగర్, వంగ లక్ష్మణ గౌడ్ కు – నాగర్ కర్నూలు, తేజవత్ సంపత్ నాయక్‌కు – వైరా, మిరియాల రామకృష్ణకు – ఖమ్మం, గోకుల రవీందర్ రెడ్డికి – మునుగోడు,నందగిరి సతీష్ కుమార్‌కు – కుత్బుల్లాపూర్, డాక్టర్ మాధవరెడ్డికి – శేరిలింగం పల్లి, ఎడమ రాజేష్ కు – పటాన్ చెరువు, మండపాక కావ్యకు -సనత్ నగర్ బాద్యతలు అప్పగించారు. వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడుకు – ఉప్పల్ , శివ కార్తీక్ కో కన్వీనర్ – ఉప్పల్ బాద్యతలు అప్పగించారు. వేముల కార్తీక్ కు – కొత్తగూడెం, డేగల రామచంద్ర రావుకు – అశ్వరావుపేట, వి.నగేష్‌కు -పాలకుర్తి, మేరుగు శివకోటి యాదవ్‌కు -నర్సంపేట, గాదె పృద్వి కి – స్టేషన్ ఘన్ పూర్, తగరపు శ్రీనివాస్‌కు – హుస్నాబాద్, మూల హరీష్ గౌడ్‌కు – రామగుండం, టెక్కల జనార్ధన్‌కు – జగిత్యాల, చెరుకుపల్లి రామలింగయ్యకు -నకిరేకల్,యన్ నాగేశ్వరరావు కు హుజూర్ నగర్, మాయ రమేష్ కు – మంథని, మేకల సతీష్ రెడ్డి కి కోదాడ, బండి నరేష్ – సత్తుపల్లి, వంశీకృష్ణ కు – వరంగల్ వెస్ట్, బాలు గౌడ్ – వరంగల్ ఈస్ట్ బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News