Monday, December 23, 2024

నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : జిల్లాలో విత్తనాల నాణ్యత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల పట్ల కఠినంగా ఉండాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూసుకోవాలని, ప్రణాళిక ప్రకారం అవసరమైన విత్తనాలు, ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

అధికారులు ప్రత్యేక మానిటరింగ్ నిర్వహిస్తూ ప్రతిరోజు విత్తనాలు,ఎరువుల స్టాక్ వివరాల సమాచారం అందించాలన్నారు. బిసి కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహయం క్రింద వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంధి దరఖాస్తుదారులు ఫీల్డ్ లెవల్‌లో కులవృత్తి చేస్తున్నారో, లేదో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, సదరు వివరాలు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ప్రదర్శించాలన్నారు. రెండో విడత పంపిణీ చేసే ప్రతి గొర్రెకు జియో ట్యాగింగ్ చేయాలని, పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల లబ్దిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ గౌతంరెడ్డి, ఆర్‌డి పవన్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News