టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ సీఎండి రఘుమారెడ్డి
హైదరాబాద్: ప్రస్తుత ఎడతెరపిలేకుండా కరుస్తున్న వర్షాల పట్ల విద్యుత్ అధికారులతో పాటు వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ ) సీఎండి జి. రఘుమారెడ్డి అన్నారు. దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థప పరిధిలోని సీజిఎం, సూపరింటెండెంట్ ఇంజనీర్లు ( ఎస్‌ఈ)లతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలు, వనియోగదారులు స్వీయ భద్రతా చర్యలు పాటించాలన్నారు. క్రిందకు వంగిన, లేదా కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ముట్టుకోవద్దన్నారు.
క్రింద పడ్డ ,వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుంచి వాహనాలను నడపడం, వైర్లను తొక్కడం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. రోడ్డు మీద నిల్వ ఉన్న నీళ్ళలో విద్యుత్ వైర్లుగాని, ఇతర విద్యుత్ పరికరాలు కాని మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదన్నారు. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు పశువులను కట్టడం, వర్షం పడేటప్పుడు, తగ్గిన తర్వాత పశువులను విద్యుత్ వైర్లకు, ట్రాన్స్‌ఫార్మలకు దూరంగా తీసుకెళ్ళాలన్నారు. వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు, చెట్లకింద నిలబడం, చెట్లు ఎక్కడం వంటి చర్యలకు పాల్పవద్దని సూచించారు. విద్యుత్‌కు సంబంధించి ఎటుంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 లేదా 100 లేదా స్థానిక ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లతో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072101, 7382072106, 7382071574లకు ఫిర్యాదు చేయలన్నారు.