Tuesday, January 21, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అకారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ జిల్లా పరిధిలో గడిచిన వారం రోజుల్లో 23 ఫిర్యాదులు రావడం జరిగిందని, ఈ యొక్క ఫిర్యాదులో బాధితులు 9,96,827 కోల్పోవడం జరిగిందన్నారు.

ఈ ఫిర్యాదులో వెంటనే స్పందించి టోల్ ఫ్రీ నెంబర్లు 1930చ డయల్ 100లకు కాల్ చేసిన ఫిర్యాదులో 81,088 ఫ్రిజ్ చేయడం జరిగిందని, కావున జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ నేరాలు జరుగు విధానం పట్ల అవగాహన ఉంటే చాలా వరకు నేరాలను తగ్గించవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తున్నారని, ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని, అతని నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు గానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేస్తున్నారు కాబట్టి ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100కు కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందేలా చేయవచ్చని తెలిపారు. జిల్లా పరిధిలో గత వారం రోజుల్లో యుపిఐ రిలేటెడ్ ఫ్రాడ్స్ 12, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ 4, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, సిమ్ స్వాప్ ఫ్రాడ్స్ 3, సైబర్ బైలింగ్, స్టాల్‌కింగ్, సెక్స్‌టింగ్ 1, ఇ వాలెట్ రిలేటెడ్ ఫ్రాడ్1, ఫ్రాడ్ కాల్ విషింగ్ 1, ప్రొఫైల్ హ్యాకింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ 1, మొత్తం 23 కేసులు నమోదైనట్లు తెలిపారు.

లాటరీ, లోన్ వచ్చిందని కాల్‌గానీ మెసేజ్ గానీ వచ్చినట్లయితే ఆశపడకుండా, అనుమానించాలని, వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్‌పి తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకూడదని, చేస్తే వాళ్లు నగ్నంగా ఉండి మీరు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారని తెలిపారు. వేలల్లో పెట్టుబడి, లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకూడదని తెలిపారు.

తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినపుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, మీకు ఉద్యోగం ఇస్తామంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బలు కట్టమన్నట్లయితే వారు సైబర్ మోసాగాళ్లని గ్రహించాలని సూచించారు.

ఇంస్టాగ్రామ్‌లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో ఉండి మిమ్మల్ని డబ్బులు పంపాలని కోరినట్లయితే మెసేజ్ మీకు తెలిసిన వ్యక్తి నుంచి పంపారా లేదా తెలుసుకోవాలని, మోసపోకూడదని సూచించారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకూడదని, కొంచెం గి ఆలోచించాలని, అది సైబర్ మోసం కూడా కావచ్చని, మీ ప్రమేయం లేకుండా మీకు ఓటిపి వస్తే దాన్ని ఎవరికీ చెప్పకూడదని, అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయిఉండవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News