Monday, December 23, 2024

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సమాజంలో శాంతి భద్రత పరిరక్షణలో పో లీస్ అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి పోలీసు అధికారుల స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని కేసులు పెండింగ్ లో లేకుండా ప్రణాళికతో పరిష్కరించాలని సూచించారు.

నేరస్తులకు శిక్షపడేందుకు దర్యాప్తు అధికారులు ఖచ్చితమైన సాక్షాదారాలను సేకరించాలని, సాక్షుల వాంగ్ములాన్ని వీడియో రికార్డు చేయాలన్నారు. విధుల్లో ఉన్న అధికారులు తమ ఒత్తిళ్ళను అధిగమించి ప్రజలకు న్యాయం అందించేలా విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశం లో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వరరెడ్డి, రవి, శ్రీనివాస్, సీఐ లు అశోక్, రాజశేఖర్, శివశంకర్, రామలింగారెడ్డి, మురారి, రా ము, రామకృష్ణారెడ్డి, రాఘవులు, రాజేష్, నాగార్జున, ఆర్‌ఐలు శ్రీనివాస్, శ్రీనివాసరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిఎం కెసిఆర్ పర్యటన స్థలాల పరిశీలన..
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలను అధికారులకు వివరించారు. రోడ్డు మార్గంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సమాచార సేకరణ, వీఐపీల అనుమతి, పోలీస్ కన్వాయ్ నిర్వహణపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీస్ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తు విధులు నిర్వహించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News