Thursday, January 23, 2025

విద్యుత్ వాహనాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Be vigilant in the maintenance of Electric Vehicles

హైదరాబాద్ : ప్రస్తుత మార్కెట్‌లో ఏ ఇద్దరు వాహనాదారులను కదిలించినా వారు విద్యుత్ వాహనాలకు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారు. వాటికి తగ్గట్టుగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సంబంధించిన వాటి వినియోగానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాకుండా వాటి కోనుగోలు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి . అంతే కాకుండా వాటిని కోనుగోను పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలను కూడా అందచేస్తున్నాయి. ప్రారంభంలో విద్యుత్ వాహనాల సంఖ్య గ్రేటర్ వ్యాప్తంగా చూసుకున్నా 500 నుంచి 1000 వాహనాలకు మించలేదు. ఒక వైపు పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటమే కాకుండా, ప్రభుత్వాలు విద్యుత్ వాహనం కోనుగోలు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా అందిస్తుండంతో ప్రస్తుతం వాటి సంఖ్య గ్రేటర్ వ్యాప్తంగా 5000 నుంచి 10000లకు పెరిగింది. విద్యుత్ వాహనాల సంఖ్య ఈ సంవత్సరం చివరి నాటికి 20 నుంచి 40 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నగరంలోని ఒక ప్రాంతంలో విద్యుత్ వానానికి సంబంధించి బ్యాటరీ కాలిపోవడంతో ఆయా వాహనాలకు కోనుగోలుపై పలువురు వాహనా దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా వాహనానికి సంబంధించిన నిర్వహణ లోపం కారణంగానే వాహనంలోని బ్యాటరీ పేలిపోయిందని వాహన రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగవని భరోసా ఇస్తున్నారు.సదరు వాహన సామర్దం దానిలో ఉపయోగించే మోటారు మీద ఆధాపడుతుందని చెబుతున్నారు.0 బ్యాటరీ సామర్థం కంటే మోటారు సామర్ధం అధికంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. విద్యుత్ వాహనమే కదా ఎటుంటి ఇబ్బంది ఉండదు అనే భావన మంచిది కాదంటున్నారు. వాహనదారుడు తరచు బ్యాటరీ వైర్లను తనిఖీ చేసుకోవాలంటున్నారు. వాహన చార్జింగ్ పూర్తయిన వెంటనే అందుకు సంబంధించిన వైర్లను తొలగించాలని చెబుతున్నారు.అంతే కాకుండా వాహనా వైరింగ్‌ను నిపుణులైన ఇంజనీర్లతో తరచు తనిఖీ చేయించుకోవాలని చెబుతున్నారు.

వాహనాన్ని తగిన గాలి వెలుతురు ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేసేవిధంగా చూడాలంటున్నారు.అంతే కాకుండా సదరువాహనాన్ని ఎప్పుడు పొడిగా ఉన్న ప్రదేశాల్లోనే నిలిపి ఉంచాలని ,సదరు వాహనాన్ని వాషింగ్ చేసిన వెంటనే ఇతర వాహనాల మాదిరిగా స్టార్ట్ చేయకూడదంటున్నారు. బౌన్స్ వ్యాటీరీలను ఇంట్లోనే నాలుగు గంటల పాటు చార్జింగ్ చేసుకోవాలని, బ్యాటరీ చార్జింగ్ సమయంలో వైనా ప్రమాదాలు సంభవిస్తే సాధారణ వాహనాల మాదిరిగా వాటిపై నీళ్ళను పోయివద్దని చెబుతున్నారు. బ్యాటరీ చార్జింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఏవైనా హెచ్చుతగ్గులు ఉన్నా. నిర్ణీత సమయానికి మించి చార్జింగ్ పెట్టినా పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ వానాలకు పొడివాతావరణంలో చార్జింగ్ అయ్యేలా చూడాలంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News