Monday, December 23, 2024

ఈవిఎంల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఈవిఎం గోదాం భద్రతలో అశ్రద్ధ తగదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసవారి తనిఖీల్లో భాగంగా ఈవిఎం గోదాంను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్‌తో కలిసి తనిఖీ చేశారు.

ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా నుండి మహారాష్ట్రకు తరలించే 12 ఈవిఎంల ప్రక్రియను పరిశీలించారు. సిసి కెమెరా గదిలోకి వెళ్లి కెమెరా పనితీరును పరిశీలించారు. కొత్తగా వచ్చిన వివి ప్యాడ్స్‌ను తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా లేదా సిసి కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ముందస్తు అనుమతి లేనిదే ఎవరిని అనుమతించరాదన్నారు. అనంతరం జిల్లా అధికారులకు నూతనంగా నిర్మించే గృహ సముదాయాల భవనానిన పరిశీలించారు. చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు బ్లాకుల్లో 8 మంది జిల్లా అధికారులను త్రిబుల్ బెడ్ రూం వసతితో నిర్మించే భవనాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈవిఎం గోడౌన్ నేషనల్ హైవే రోడ్డు పోతున్న సందర్భంగా కొత్త ఈవిఎం గోదాంను నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ జాకీర్ అలీ, ఎలక్షన్ విభాగం సిబ్బంది కరుణాకర్, కలెక్టర్ పిఎస్ ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News