Monday, November 18, 2024

70 ఏళ్ల వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి: రక్తమోడుతూ ఆసుపత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో ఒక 70 ఏళ్ల వృద్ధుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మహారాష్ట్రకు చెందిన విట్టు షలాకే అనే 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం రాంనగర్ నుంచి తింబోలి గ్రామానికి అటవీ మార్గంలో వెళుతుండగా అతనిపైకి ఎలుగుబంటి దాడి చేసింది. ఆ వృద్ధుడి ఒక కన్నును పెరికివేసింది. ఆ వృద్ధుడు బిగ్గరగా అరుస్తూ పెడబొబ్బలు పెట్టడంతో ఆ ఎలుగుబంటి అతడిని వదిలివేసి అడవిలోకి పారిపోయింది. తీవ్ర రక్తగాయాలపాలైన ఆ వృద్ధుడు అలాగే దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామంలోకి చేరుకున్నాడు. రక్తమోడుతున్న షెలాకేను వెంటనే గ్రామస్తులు రాంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం అతడిని బెలగావిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నివసించే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎలుగుబంటి దాడి నుంచి ్రగ్రామస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News