Friday, January 10, 2025

అంగారకునిపై ఎలుగుబంటి ముఖం

- Advertisement -
- Advertisement -

అంగారక గ్రహంపై ఎలుగుబంటి ముఖం బోలిన ఆకారం స్పష్టంగా సాక్షాత్కరిస్తోంది. నాసాకు చెందిన మార్స్ రీకనైజాన్స్ ఆర్బిటర్ కెమెరా ఈ అసాధారణ దృశ్యాన్ని చిత్రీకరించగలిగింది. శాస్త్రవేత్తలు , అంతరిక్ష వీక్షకులు వందల మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ఎలుగు ముఖాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఈ చిత్రంలో ముక్కులా కనిపించేది వాస్తవానికి ఒక కొండ. ‘v ’ అనే ఇంగ్లీష్ అక్షరం ఆకారంలో ఉంది.

రెండు కళ్లు చిన్నపాటి పల్లంలో ఉన్న బిలాలు అని ఆరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల చుట్టూ ఉన్న వలయం వృత్తాకార పగులు నమూనాగా భావిస్తున్నారు. బహుశా మూసుకు పోయిన బిలం తాలూకు అవశేషంగా అనుకుంటున్నారు. ఇక ముక్కులా కనిపించేది అగ్నిపర్వతం లేదా మట్టిబిలం కావచ్చునని,దానిపై పేరుకుపోయినది లావా లేద మట్టి ప్రవాహం కావచ్చని భావిస్తున్నారు. నాసా గత నెలలో దీన్ని ఫోటో తీసింది.

సోషల్ మీడియాలో ‘so cute ’( చాలా అందమైన) అన్న శీర్షికతో ఈ ఫోటో వైరల్ కావడం పలువురిని ఆకట్టుకుంది. మరి కొందరు ఇది బాతులా కనిపిస్తోందని అంటున్నారు. అరుణ గ్రహంపై ఈ ఆకర్షణ సహజంగా ఏర్పడింది. అమెరికా, చైనా దేశాలు మాత్రమే అంగారక గ్రహంపై విజయవంతంగా తమ రోవర్లను దింప గలిగారు. 2021 ఫిబ్రవరిలో నాసాకు చెందిన అంతరిక్ష రాకెట్ పెర్సెవరెన్స్ రోవర్ ఆ గ్రహంపై సురక్షితంగా అడుగుపెట్ట గలిగింది. గతకాలం జీవాధారాల కోసం పరిశోధన సాగిస్తోంది. 2021 మే లో చైనా తన రోవర్‌ను అంగారకునిపైకి పంపించి పరిశోధన ప్రారంభించింది. అదే సంవత్సరం అంగారకుని పైకి వ్యోమనౌకను పంపే మొదటి అరబ్ దేశంగాఅరబ్ ఎమిరేట్స్ చరిత్రకెక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News