- Advertisement -
కరీంనగర్: నగరంలోని పలు ప్రాంతాలలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. శనివారం తెల్లవారు జామున నగరంలోని రాజ్వీ చమన్, శుభం గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించింది. 10గంటల ప్రాంతంలో రేకుర్తి దాసరి గార్డెన్ లోకి ప్రవేశించింది. భయాందోళనతో నగర వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా రెస్పాన్స్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో రాజ్వీ చమన్ గల్లిలో కర్రలు పట్టుకొని యువకుల గస్తీ నిర్వహించారు. ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించిన సీసీ పుటేజ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, ఎలుగుబంటిను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -