న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో పౌరుల స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అత్యంత కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇది నేరుగా సరైన విధానాలతో కూడిన పరిపాలనతోనే సాధ్యం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల్సి ఉంటుందన్నారు. శనివారం ఆయన ఇక్కడ జరిగిన బ్యూరో ఆఫ్ పోలీసు రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్ అండ్ డి) 51వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు. మౌలిక స్థాయిల్లో విధుల నిర్వహణల్లోని వారే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధాన బాధ్యత వహిస్తారని తెలిపారు. విధులలో ఉండే బీట్ కానిస్టేబుల్ సమర్ధవంతంగా పనిచేస్తూ, సామాన్యుడిని రక్షిస్తే ప్రజాస్వామ్య విజయంలో అదే అతి పెద్ద ముందడుగు అవుతుందని తెలిపారు. శాంతిభద్రతలు బాగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యం మన ప్రవృత్తి. స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచే అంతర్లీన లక్షణంగా ఉంటూ వచ్చింది. స్వాతంత్య్రం తరువాత ప్రజాస్వామ్య పంథానే మనం ఎంచుకున్నాం. ప్రజల జీవనధర్మంలో ప్రజాస్వామ్యం అంతర్భాగం అయింది. ఇక జనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యంలో వ్యక్తుల స్వేచ్ఛను మించిది లేదని హోం మంత్రి తెలిపారు.
కానిస్టేబులైనా కీలకమే: అమిత్ షా
- Advertisement -
- Advertisement -
- Advertisement -