Monday, November 25, 2024

90 ఏళ్ల వృదుడికి కేర్ ఆసుపత్రిలో బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాయ్‌పూర్‌కు చెందిన 90 ఏళ్ల వృదుడికి క్వాడ్రాపూల్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు కేర్ ఆసుపత్రి కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ ప్రతీక్ భట్నాగర్ తెలిపారు. కాళ్లకు ఎలాంటి కోతలు లేకుండా, ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా, గుండెకు ఎలాంటి కోతలు లేకుండా, గుండె ఆగకుండా బైపాస్ ఆపరేషన్ చేశారు. ఈసందర్భంగా ఆయన వివరిస్తూ పేషెంట్ పరాస్రామ్ తన అస్థిరమైన ఆంజినా (విశ్రాంతి సమయంలో ఛాతీ నొప్పి) కలిగిఉన్నాడు. కరోనరీ యాంజియోగ్రఫీ చేయగా బిగుతుగాఉన్న ఎడమ ప్రధాన కరోనరీఆర్టరీ వ్యాధిని కలిగిఉన్నటు నిర్దారణ కావడంతో అతని కర్ణికదడలో కూడా ఇబ్బందిపడడంతో బైపాస్ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ణయించడం జరిగిందన్నారు.

వయస్సు మీద పడిన చురుకైన వ్యక్తికావడంతో, అతనికుటుంబం మెరుగైన జీవన నాణ్యత కోసం కరోనరీ బైపాస్ సర్జరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనితో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా వైద్య బృందం రోగికి వై గ్రాఫ్ట్‌ని ఉపయోగించి అతనికి 4 బైపాస్ గ్రాఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతో రోగి తిరిగి కోలుకున్నట్లు చెప్పారు. 90 ఏళ్లవయస్సులో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయడంలో ప్రధాన ప్రమాదాలు బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి రిస్క్ ఉంటాయని దీంతో ఈవయస్సులో అథెరోమాటస్ అయిన బృహద్ధమని తాకకుండా మొత్తం శస్త్రచికిత్స అనార్టిక్ చేసినట్లు తెలిపారు. తద్వారా మెదడు స్ట్రోక్ సంభవించకుండా నిరోధించినట్లు కొట్టుకుంటున్న గుండెపై వై గ్రాఫ్ట్‌తో మొత్తం ధమనిరీవాస్కులరైజేషన్ చేయడం ద్వారా ఈ అనార్టిక్ బైపాస్ సర్జరీ సాధించబడిందన్నారు.

అనంతరం నీలేష్ గుప్తా మాట్లాడుతూ బీటింగ్ హార్ట్సర్జరీ చేయడంలో డాక్టర్ భట్నాగర్ అంతర్జాతీయంగా ఖ్యాతి పొందారన్నారు. ఈ సర్జరీకి కాళ్లలోఎలాంటి కోతలు అవసరం లేదు. కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ అద్భుతమైన ఫలితాలతో ఈ హై-ఎండ్కరోనరీ బైపాస్ సర్జరీని నిర్వహించడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News