Wednesday, January 8, 2025

గుండెలో 12 స్టెంట్‌లు…. బీటింగ్ హార్ట్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

కేర్ హాస్పిటల్‌లో గుండెలో 12 స్టెంట్‌లు ఉన్న వ్యక్తికి
విజయవంతంగా అరుదైన బీటింగ్ హార్ట్ సర్జరీ

Beating Heart Surgery in Care hospital
మనతెలంగాణ/హైదరాబాద్ : స్టెంట్‌లను కలిగి ఉన్న 55 ఏళ్ల డయాబెటిక్ రోగికి కేర్ హాస్పిటల్ వైద్యులు బీటింగ్ హార్ట్ సర్జరీని నిర్వయించి సాధారణ జీవితాని ప్రసాదించారు. సిబివి సుబ్బరాయుడు(55) 2002వ సంవత్సరం నుండి రొటీన్‌గా ఆంజినా (ఛాతీనొప్పి) తో ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఆయన గుండె వైద్యులను సంప్రదించగా రోగి తన కరోనరీ ధమనులలో బ్లాకేజ్ ఉండడంతో స్టెంట్లను వేశారు. అయినప్పటికీ రోగి ఇబ్బందికి పరిష్కారం లభించలేదు. కాగా, అతను జంటనగరాల్లోని 5 వేర్వేరు ఆసుపత్రులలో 5 చోట్ల చికిత్స పొందగా, మొతం కరోనరీ ధమనులలో వైద్యులు 12 స్టెంట్లను వేశారు. అయినా ఇటీవల ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్‌ను సంప్రదించగా, రోగికి పరీక్షలు నిర్వయించి గుండె లోపల 12 స్టెంట్‌లతో, హృదయ ధమనులు దాదాపుగా ఉక్కుగా మారిపోయినట్లు గుర్తించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

పలుచని మెలితిరిగిన హృదయ ధమనులు ప్రతిచోటా స్టెంట్‌ల కారణంగా గట్టిగా, ఉక్కులా మారాయని, దీనివలన రోగి గుండెకు తీవ్ర ప్రమాద పరిస్థితిని కలిగి ఉండడంతో తీవ్ర ప్రమాదం ఎర్పడిందని తెలిపారు. దాంతో డాక్టర్ భట్నాగర్, అతని బృందం, కార్డియాక్ అనస్తీటిస్టులు డాక్టర్ శ్రీనివాస్ బోవోల్లా, డాక్టర్ శ్రావ్య రెడ్డిలు, హృదయ ధమనులలో బైపాస్ గ్రాఫ్ట్‌లను గుర్తించి, గుండె కరోనరీ ధమనులలో చాలా సున్నితమైన విచ్ఛేదనం చేశారు. కాళ్లపై ఎటువంటి కోతలు లేకుండా టోటల్ ఆర్టీరియల్ రివాస్కులరైజేషన్ సర్జరీ నిర్వహించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కొట్టుకుంటున్న గుండెకు మొత్తం సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత రోగి అద్భుతoగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన వారం రోజుల తర్వాత రోగిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మెదక్కర్ మాట్లాడుతూ, డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, అతని బృందం బిఐఎంఎ బైపాస్ సర్జరీ టెక్నిక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటుందని అన్నారు. ఈ టెక్నిక్‌లో కాళ్లు,చేతులపై ఎటువంటి కోతలు ఉండవని, ఇది దీర్ఘకాల బైపాస్ సర్జరీ పద్ధతి కూడా అని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో హృద్రోగులకు రొటీన్‌గా బిఐఎంఎ బైపాస్ సర్జరీని అందించడానికి అన్ని సరికొత్త సౌకర్యాలు కలిగి ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News