Sunday, December 22, 2024

ప్రేమికుడే యముడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనను వివాహం చేసుకోవాలని కోరిన యువతిని ట్యాంకర్ కిందకు తోసి హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, నెమలిగుట తండాకు చెందిన ప్రమీల బాచుపల్లిలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన రోడ్డు తండాకు చెందిన తిరుపతిని ఐదు నెలల నుంచి ప్రేమిస్తోంది.

తిరుపతి హఫీజ్‌పేటలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యువతి ఉంటే హాస్టల్‌కు తిరుపతి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలోనే ప్రమీల తనను వివాహం చేసుకోవాలని తిరుపతిని పలుమార్లు కోరేది. ఎంత చెప్పిన వినిపించుకోకపోవడంతో కనీసం తనను ఇంటికి తీసుకుని వెళ్లి అతడి తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. యువతి వివాహం చేసుకోవాలని గొడవ చేస్తుండడంతో ఆమెను తొలగించుకోవాలని తిరుపతి ప్లాన్ వేశాడు.

ఉదయం ప్రమీల వద్దకు వెళ్లిన తిరుపతి గొడవపడుతూ రోడ్డుపై వస్తున్నారు. ఆ సమయంలోనే రోడ్డుపై వస్తున్న ట్యాంకర్ కింద ప్రమీలను తోసివేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News