Thursday, January 23, 2025

సుందరికరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:పట్టణ సుందరికరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు ంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, మెడికల్ కళాశాలల్లో జరుగుతున్న గ్రీనరీ, పనులను ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే గ్రీనరీతో ఐ లవ్ సూర్యాపేట, తెలంగాణ వంటి సెల్ఫీపాయింట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ చౌరస్తార జనగాం క్రాస్ రోడ్డు, మెడికల్ కళాశాలలోని గ్రీనరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. పట్టణంలో పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటికే మినీట్యాంక్‌బండ్ కట్ట కి ందిభాగంలో ఏర్పాటు చేసిన వివిద రకాల పూల మొక్కలు, పచ్చదనం చూపరులను ఆకట్టుంటున్నాయి.

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ పార్కు వద్ద ద్వంసమైన రహదారిని వెంటనే మరమ్మత్తు చేపట్టాలని అధికారులను సూచించారు. మెడికల్ కళాశాలలో బాలికల హాస్టల్‌కు మరో గేటు సౌకర్యాలన్ని ఏర్పాటు చేయాల ని సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయల సంస్థ చైర్మన్ ని మ్మల శ్రీనివాస్ గౌడ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శారదాదేవి, మున్సిపల్ కమిషనర్ రామానుజులారెడ్డి, అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

శరవేగంగా సూర్యాపేట సుందరీకరణ
సూర్యాపేట సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీట్యాంక్‌బండ్ కట్టకింది భా గంలో ఏర్పాటు చేసిన ఐ లవ్ సూర్యాపేట, తెలంగాణను వివిధ ర కాల పూలమొక్కలతో ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీంతో పాటు కట్టపై భాగంలో ఏర్పాటు చేసిన మొక్కలు, పూజచెట్లు ట్యా ంక్‌బండ్‌కు మరింత అందాన్ని తెచ్చాయి.

సూర్యాపేటకు ముఖద్వారంగా ఉన్న జనగాం క్రాస్ రోడ్డు, మెడికల్ కళాశాల, ఎన్టీఆర్‌పార్కు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన గ్రీనరీ పేటకే కొత్త అందాలను తీసుకవచ్చాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీటితో పా టుగా ఇంటిగ్రెటెడ్ మార్కట్, మహాప్రస్థానంలో ఏర్పాటు చేసిన గ్రీనరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పచ్చని అందాలతో సూర్యాపేటను తీర్చిదిద్దడమే లక్షంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News