Friday, December 20, 2024

హుస్సేన్ సాగర్ లో అందమైన పార్కు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లోని జలవిహార్ వద్ద పది ఎకరాలలో అందమైన పార్క్‌ను హెచ్‌ఎండిఎ అభివృద్ధి చేసిందని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ఈ పార్కును అతి త్వరలో ప్రారంభిస్తామని తన ట్విట్టర్‌లో కెటిఆర్ ట్వీట్ చేశారు. సాగర్‌లోకి బ్రిడ్జి లాగా వాక్ వేను నిర్మించారు. ఈ దృశ్యం చూడటానికి చూడముచ్చటగా ఉంది. ఈ పార్క్ హుస్సేన్ సాగర్‌కు అందం తెచ్చిపెడుతుంది. వి ఆకారంలో ఉన్న వాక్‌వే అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గండిపేట పార్క్ లాగా ఉందని కార్తీక్ అనే నెటిజన్ కామెంట్ ఇచ్చారు. సెంట్రల్ హైదరాబాద్‌కు హుస్సేన్ సాగర్ కు బ్రాండ్‌గా ఈ పార్క్ మారిపోతుందని రఘువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. హైదరాబాద్‌లో బీచ్‌లు లేవు హుస్సేన్‌సాగర్ సమీపంలో నెక్లెస్ రోడ్డులో కృత్రిమమైన బీచ్ తయారు చేస్తే బాగుంటుందని బిఎస్ రావు అనే నెటిజన్ కామెంట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News