Wednesday, March 26, 2025

బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఎంటర్‌టైన్‌చేయనున్న ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత హరీష్ మాట్లాడుతూ పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అందరికీ హృదయాలను దోచుకుంటుందని అన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ “సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. లవ్‌స్టోరీ కొత్తగా ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక, దర్శకుడు రామ్ గోదాల, ప్రవీణ్, బ్రహ్మా కడలి, నిరంజన్, మణికందన్, సుహాస్ మెహిన్, సాత్విక్ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News