Sunday, December 22, 2024

బ్యూటీ పార్లర్ ముసుగులో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ముగ్గురు నిందితులు బాధితులకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాచుపల్లికి చెందిన ఇస్మాయిల్, సమీనా భార్యాభర్తలు, సమీనా సోదరి జెస్సికా కలిసి గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. యూట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ చేసి పలువురు కస్టమర్లను ఆకర్షించారు. ఒక్కో ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు రూ.35,000 జీతం ఇస్తామని చెప్పి, వారి వద్ద నుంచి రూ.3.20లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత రెండు, మూడు నెలల వరకు వారికి జీతం ఇచ్చి,

తర్వాత ఇవ్వడం మానివేశారు. ఇలా పలువురు బాధితుల వద్ద నుంచి రూ.3కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. బాధితులు జీతం కోసం వీరికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిహైదరాబాద్ ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్‌కు వెళ్లిన బాధితులకు తాళం వేసి ఉండడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల నుంచి బ్రాంచ్ మూసివేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ నిందితులు గతంలో చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News