Wednesday, January 22, 2025

‘బెదురులంక 2012’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సినిమా టీజర్ విడుదల చేశారు.

ఇక హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ “ప్రేక్షకులు అందరినీ థియేటర్లకు రప్పించే సినిమా ఇదవుతుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్, డ్యాన్స్… అన్నీ కథలో నుంచి వస్తాయి. దర్శకుడు క్లాక్స్‌తో పని చేయడం లక్కీ. హీరోయిన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు పల్లెటూరిలో ఒదిగిపోయే అమ్మాయి కావాలి. ’డీజే టిల్లు’లో నేహా చేసిన క్యారెక్టర్ మోడ్రన్ గా ఉంటుంది. కానీ చిత్ర పాత్రలో ఆమె పర్ఫెక్ట్‌గా చేసింది” అని అన్నారు.

చిత్ర దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “నిజాయతీగా చేసిన ప్రయత్నం ఇది. నటీనటులు అందరూ సపోర్ట్ చేశారు. పదేళ్ళ క్రితం నుంచి ఈ కథను చెబుదామని అనుకుంటున్నా. ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత ప్రేక్షకులు కొత్త కంటెంట్ కూడా చూస్తారని నమ్మకం మాకు పెరిగింది. ఈ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, బీవీఎస్ రవి, బెన్నీ ముప్పానేని, దుర్గారావు, రాజేశ్వరి, అనితా నాగ్, దివ్య నార్ని, నటులు కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News