Sunday, December 22, 2024

ఆదిలాబాద్ లో 30 మంది కూలీలపై తేనెటీగల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదిలాబాద్ లోని భేలా మండలంలోని రేణిగూడ కుగ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎన్ఆర్ఈజిఏ) మట్టి త్రవ్వకాలు చేస్తున్న కూలీలపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు కుట్టడం వల్ల 17 మంది కూలీలు బాధితులయ్యారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ధ్రువీకరించారు. వారిని ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చేర్చారు. మిగతా 13 మందికి భేలాలోని సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆదిలాబాద్ ఆసుపత్రిలో చేరినవారి పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంది. బాధితులకు వైద్య సదుపాయం పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News