Wednesday, November 6, 2024

దేశంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా రూ.160,721 కోట్లు ఆదా చేసిన బిఇఇ

- Advertisement -
- Advertisement -

ఏడాది 249.88 బిలియన్ యూనిట్లు ఆదా
గణనీయమైన ఇంధన పొదుపునకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అద్భుతం
దక్షణాధి రాష్ట్రాల వర్చువల్ మీటింగ్‌లో బిఇఇ కార్యదర్శి మిలింద్ దేవర

మన తెలంగాణ /హైదరాబాద్: ఇంధన సామర్థ్యం, పరిరక్షణని నిబద్ధత నిర్వహిస్తున్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బిఇఇ) 2021–22 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన మైలురాళ్లను అధిగమించింది. మొత్తంగా రూ.160,721 కోట్ల విలువైన ఇంధనాన్ని పొదుపు చేసి భారత ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలిచింది. వరుసమార్గదర్శకాలతో బిఇఇ గణనీయమైన మొత్తంలో ఇంధన వనరుల్ని ఆదా చేయడమే కాకుండా, కర్బన ఉద్గారాలను నియంత్రణతో పాటు.. భారత్ లో స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 249.88 బిలియన్ యూనిట్ల విద్యుత్ తో పాటు.. 23.85 మిలియన్ టన్నుల చమురుతో సమానమైన థర్మల్ పవర్ ని ఏటా ఆదా చేస్తోంది. ఇది మొత్తం 44.43 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధన ఆదాకి సమానమని బిఇఇ కార్యదర్శి మిలింద్ దేవర స్పష్టం చేశారు. ఇది దేశ ప్రాథమిక ఇంధన సరఫరాలో 6% పొదుపు చేసినట్లు వెల్లడించారు. ఈ ఇంధన పొదుపు భారతీయ ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా రూ. 160,721 కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించినట్లు తెలిపారు.

భారతదేశ వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇంధన వినియోగాన్ని పెంచడానికి దారితీసిందని దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల ఏజెన్సీల సిఇవోలు హెచ్‌వోడిలతో ఢిల్లీ నుంచి వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వ కృషి భేష్…
ఈ సందర్భంగా టిఎస్ రెడ్కొ ఛైర్మన్ జానయ్య తెలంగాణ ప్రభుత్వం ఇంధన పునరుత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను వివరించగా ఇంధన సామర్థ్య నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ నగరాలతో పాటు వైజాగ్, త్రివేండ్రం వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇంధన సామర్థ్య నిర్వహణపఒ దృష్టి పెట్టాలని బిఇఇ ఆలోచిస్తోందని డైరెక్టర్ అభిషేక్ శర్మ తెలిపారు. ఇటీవల టిఎస్ రెడ్కొ , ఎస్‌డిఏ హెచ్.ఓ.డీలతో జరిగిన సమావేశంలో మిలింద్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారన్నారు. స్థిరమైన రవాణాని ప్రోత్సహించేలా ఇవి లకు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాల చార్జింగ్ మౌలికసదుపాయాల కోసం దేశ వ్యాప్తంగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లని అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి బిఇఇ అడుగులు వేసేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News