Wednesday, January 22, 2025

సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి క్రైమ్ : బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి వేశాయి బీడీ కంపెనీ ముందు బీడీ కార్మికులు మంగళవారం ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల ఫెడరేషన్ జనపరల్ సెక్రటరీ ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 సంవత్సరాల క్రితం నుంచి బీడీ కార్మికులు బీడీలు చేసుకుని బతుకున్నారని తెలిపారు. అప్పట్లో బీడీ కంపెనీలో పేర్లు తప్పు పడ్డాయని ఆ పేర్లను సరిచేయాలని ఎన్ని సార్లు తిరిగిన బీడీ కంపనీ కమీషనర్ పేర్లు మార్పిడి చేయాలని చెప్పి పట్టంచుకోవడం లేదని అన్నారు.

అలా చేస్తే బీడీలు చేసి రాజీనామా చేసిన వారికి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వబడుతుందని, అందుకే బీడీ కంపనీ కమీషనర్ పేర్లు మార్పిడి చేయడం లేదని అన్నారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు రోడ్డెక్కె పరిస్థితి ఏర్పడిందన్నారు. బీడీ కంపనీ మేనేజర్ బ్రిజేష్ ఏ పాటిల్ సంప్రదించగా ఇది మా కంపనీకి సంబంధం లేని విషమని చెప్పారన్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతు ప్రతి నెల 27 న ఏదో ఓ చోట క్యాంపు జరుగుతుందని క్యాంపు జరిగే స్థలం కూడా ముందుగానే పేపర్లో తెలియజేస్తున్నట్లు తెలిపారు. కాని బీడీ కార్మికుల సంఘాలు బీడీ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News