- Advertisement -
అమరావతి: ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర కింగ్ ఫిషర్ బీరు లోడ్ లారీ ఆదివారం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ రోడ్లుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. జాతీయ రహదారిపై బీరుసీసాల కోసం స్థానికులు ఎగబడ్డారు. శ్రీకాకుళం నుంచి మదనపల్లికి బీరు లోడ్ తో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
- Advertisement -