Sunday, September 8, 2024

బీరు.. జోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ఉక్కిరి బిక్కి రి చేస్తున్న ఉక్కపోత నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు బీర్ల కోసం ఎగబడుతున్నారు. కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పో ల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకా లు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు పే ర్కొన్నారు. తాజాగా ఎక్సైజ్ అధికారులు తె లిపిన లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు మందుబాబులు ఏకంగా రూ.670 కోట్లు విలువైన 23 ల క్షల కేసుల బీరులను తాగేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే బీర్ల విక్రయాలు 28.7 శాతం పెరిగాయి. 15 రోజులుగా బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో అ మ్మకాలు మరింత తగ్గాయని, లేకపోతే బీర్ కేసుల సంఖ్య పెరిగేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

వర్షం ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడింది. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే వచ్చే నెలలో బీర్ల విక్రయాలు మరింత ఎక్కువగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా తెలంగాణలో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. మార్చి 12వ తేదీ వ రకు 51 లక్షల కేసుల బీర్ల విక్రయాలతో ఎ క్సైజ్ శాఖ రికార్డు సృష్టించగా ఏప్రిల్ నెల లో 18 రోజుల్లోనే సుమారుగా 23 లక్షల కే సుల బీర్లు అమ్ముడవ్వడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కింగ్‌పిషర్ బీర్లు చాలా దుకాణాల్లో దొరకడం లేదని బీరు ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News