Friday, January 10, 2025

కొలనుపాక భూముల వివాదంతో నాకు సంబంధం లేదు: బీర్లా అయిలయ్య

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సవాల్ విసిరారు. కొలనుపాక భూముల వివాదంతో తనకు సంబంధంలేదని, తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. లేదంటే గొంగిడి సునీత రాజకీయ సన్యాసం చేయాలన్నారు. యాదాద్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గొంగిడి సునీత మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారరని, ఎర్రగడ్డకు వెళ్లి చూపించుకో రిఫర్ చేస్తానని బీర్ల ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పు చేశారు కాబట్టే ఎసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారన్నారు. సంవత్సరం నుంచి ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి తనపై గుడ్డ కాల్చి మీద వేస్తున్నారని ధ్వజమెత్తారు. బిసి ఎంఎల్ఎను కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేరు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం అని బీర్ల ప్రతి సవాల్ విసిరారు. దమ్ముంటే పది రోజుల్లో నిరూపణ చేయాలని లేదంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News