Thursday, January 23, 2025

పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటుతో..

- Advertisement -
- Advertisement -

యూత్‌ను అలరించే కథతో సందేశాన్నిస్తూ తెరకెక్కిన సినిమా ‘బీఫోర్ మ్యారేజ్’. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై.నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ ఇది. భరత్, నవీన రెడ్డి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగాఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ “పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటుతో జీవితంలో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విషయాన్ని వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ సినిమాను తెరకెక్కించాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, హీరో భరత్, హీరోయిన్ నవీన రెడ్డి, ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News