- Advertisement -
ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్‌బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌కు పది అడుగుల దూరంలోనే యాచకురాలు హత్యకు గురికావడంతో స్థానికలు షాక్‌కు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు యాచకురాలి గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాచకురాలిని హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
- Advertisement -