Wednesday, January 22, 2025

విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం

- Advertisement -
- Advertisement -

విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున బస్టాండ్ లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్ బెంచీలను రాత్రంతా ఆక్రమించుకోగా, యాచకులు మద్యం తాగి వచ్చి బస్టాండ్ లో ఉంటున్నారు. ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ చర్యలు తీసుకుంది. బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రెచ్చిపోయిన వంద మందిపైగా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు పోలీసులపకి దాడికి దిగారు.

బ్లేడ్ తో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఆర్టీసీ పొరుగులసేవల సిబ్బంది సాంబయ్యకు గాయాలయ్యాయి. యాచకులు బస్టాండ్ లోని ఆర్టీసీ విచారణ సిబ్బందిపైనా దాడికి ప్రయత్నించారు. దాడిలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్ స్ఫక్టర్ వై. శ్రీనివాసరావుకు గాయాలయ్యాయిు. గంట పాటు జరిగిన ఆందోళనతో సిబ్బంది, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అదనపు పోలీసుల రాకతో బ్లేడ్ బ్యాచ్, యాచకులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరని పట్టుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. రైల్వే స్టేషన్ లో యాచకులు రానివ్వకపోవడంతో బస్టాండ్ కు యాచకులు వస్తున్నారు. బస్టాండ్ నుంచి పంపడాన్ని నిరసిస్తూ యాచకులు, బ్లేడ్ బ్యాచ్ ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News