Sunday, December 22, 2024

ఏరువాక పౌర్ణమి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య ఆదివారం స్వయంగా నాగలి పట్టి దుక్కిదున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఎద్దుకు పూజ చేసి, నాగలితో పొలం దున్నారు. ఏరువాక పున్నమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులందరూ ఈ పండుగను జరుపుకుంటారని, ఏరు అం ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి, ‘ఏరువాక’ అం దుక్కి ప్రారంభ దినం అని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

వ్యవసాయానికి సిద్ధంగా ఉంచే ఒక గొప్ప పండుగ ఏరువాక పౌర్ణమి అని ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం రైతులకు పండుగగా మారాలని ఆకాంక్షించారు. పొలంలో దుక్కి దున్నడంతో ప్రారంభించి, వ్యవసాయ పనులను ప్రారంభించన ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అన్నదాతలు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు

మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడంతో ప్రారంభమైన వ్యవసాయ పనులు, ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటు, ఈ ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్కినేని అలేఖ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News