Saturday, December 21, 2024

రేపు బేగంపేట్ వైకుంఠ ధామంను ప్రారంభించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః నాడు చెట్లు పుట్టలు, మట్టి దిబ్బలతో అడుగుతీసి అడుగు వేసేందుకు కూడ ఇబ్బందులు పడే విధంగా ఉన్న బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ స్మశాన వాటిక నేడు సకల సౌకర్యాలతో ఎవ్వరూ ఊహించని రీతిలో మహా నిర్యాణం పేరుతో అత్యాధునిక రీతిలో వైకుంఠ ధామాన్ని జిహెచ్‌ఎంసి తీర్చిదిద్దింది. మానువుల చివరి మజిలీలో పాల్గొనే బంధువులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా సకల సౌకర్యాలలతో ఆధునిక పద్దతిలో గ్రేటర్ వ్యాప్తంగా ప్రధాన స్మశాన వాటికల అభివృద్ది పనులకు జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బేగంపేట్ శ్యామ్‌లాల్ బిల్డింగ్ వద్ద ఉన్న స్మశాన వాటికను రూ.8.54 కోట్ల వ్యయంతో అభివృద్ది చేసింది. ఇక్కడ కనీస వసతులు కూడా లేక గతంలో చనిపోయిన తమ వారి అంతిమ సంస్కరాలు చేసేందుకు ఇబ్బందులు పడడమే కాకుండా ఆ తర్వాత కార్యక్రమాల కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది.

బేగంపేట్ శ్యామ్‌లాల్ బిల్డింగ్ వద్ద రూ.8.54 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన మహా పరినిర్యాణం ( వైకుఠం దామం)నాని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సి.హెచ్.మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ సుంకరి రాజు, మల్కాజ్‌గిరి ఎంపి. రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్‌కుమార్, సురభి వాణిదేవి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎవిఎన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, జిహెచ్‌ఎంసి కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News