Wednesday, January 22, 2025

మంచు ముంచిన బీజింగ్‌లో మెట్రోరైళ్ల ఢీ..515 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ఘటనలో మొత్తం 515 మంది గాయపడ్డారు. వీరిలో 102 మందికి పైగా ఎముకలు విరిగిన గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ భారీ స్థాయి సబ్‌వే ప్రమాదం దట్టమైన మంచుపడుతున్న వేళలో చోటు చేసుకుందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. మంచు కురిసి ఉండటంతో ముందుగా వెళ్లుతున్న మెట్రోరైలుకు సడెన్ బ్రేక్‌లు వేశారు. వెనుక నుంచి వస్తున్న రైలుకు బ్రేక్‌లు పడకపోవడంతో ముందున్న రైలును బలంగా ఢీకొందని వెల్లడైంది గురువారం రాత్రి బీజింగ్‌లోని పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే మార్గంలో ఎత్తునుంచి వెళ్లే రైలుమార్గంలో ఈ ప్రమాదం జరిగింది.

నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఉండే హైటెక్ హబ్, మింగ్ సమాధుల ప్రాంతాల మీదుగా మెట్రోరైళ్లు ప్రయాణిస్తున్నాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు బీజింగ్ మున్సిపల్ కమిషన్‌కు చెందిన రవాణా విభాగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత విస్తృతస్థాయి మెట్రో రైళ్ల నిర్వహణ ఘనతను బీజింగ్ సొంతం చేసుకుందిఈ వ్యవస్థలో 27 లైన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు 13 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ రైళ్లల్లో వెళ్లుతుంటారు. గత మూడు రోజులుగా సబ్‌వే ట్రైన్లలో భారీ జనసందోహం ఉంటూ వస్తోంది. భారీ మంచు కురుస్తూ ఉండటంతో నగరజీవులు సొంత వాహనాలు వీడి, ప్రజా రవాణా వాడుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.ఈ క్రమంలో భారీ రద్దీ నేపథ్యంలో ఈ రైళ్ల ఢీ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News