Sunday, March 16, 2025

ఇది నేను చేసిన వాటికి భిన్నమైన పాత్ర: దినేశ్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. టీం మొత్తంలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది ఈ జట్టు. కానీ, ఆర్‌సిబికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు. అయితే ఈ18వ సీజన్‌లో అయినా.. ఆ కప్‌ కోరికను తీర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఆర్‌సిబి. ఈ క్రమంలో తమ ప్రధాన కోచ్‌గా దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా దినేశ్ కార్తీక్ కోచ్‌గా చేయడం అనేది ఇప్పటికూ తాను చేసినవాటి కంటే భిన్నమైన పాత్ర అని చెప్పుకొచ్చాడు.

ప్లేయర్‌గా ఉన్నప్పుడు లగ్జరీగా ఉంటుందని.. సహాయం చేయడానికి చుట్టు చాలా మంది ఉంటారని.. కానీ కోచ్‌గా ఉంటే అలా జరగదని పేర్కొన్నారు. కోచ్‌యే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడంతో పాటు అందరికీ సర్వీస్ చేయాలని అన్నాడు. ఇక ఐపిఎల్ మెగా వేలం జరిగినప్పటి నుంచి జట్టుకు సంబంధించి అవగాహన తెచ్చుకున్నానని డికె పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై దృష్టిసారించినట్లు తెలిపాడు. ఇప్పుడు తమ జట్టు బాగుందని.. కానీ ఇతర జట్లు కూడా అంతే మంచిగా ఉన్నాయని అన్నాడు. ఇక ఆర్‌సిబిలో స్వదేశీ, విదేశీ ప్లేయర్లందరిని సమానంగా చూస్తానని డికె తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News