Monday, December 23, 2024

మంత్రిగా ఉండి జర్నలిస్టులకు అన్యాయం చేశావు

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : మంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఈటెల రాజేందర్ అన్యాయం చేశాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్థలాల కోసం జర్నలిస్టుల ధర్నాలో ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎందుకు ఇళ్లస్థలాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనొక్కరే కదా మంత్రి అప్పుడు ఎవరూ ఆపారని ప్రశ్నించారు. ఇట్టి విషయంపై హుజురాబాద్‌లో చర్చకు సిద్దమా అని మండిపడ్డారు. దొంగె దొంగ అన్నట్లుగా ఈటెల రాజేందర్ వ్యవహారం ఉందని అన్నారు. హుజురాబాద్‌లో జర్నలిస్టులకు అతిత్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News