Wednesday, January 22, 2025

ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సేవలు అందిస్తా..

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట నూతన ఎసిపిగా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

సిద్దిపేట: శాంతి భద్రత కా పాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని సిద్దిపేట నూతన ఏసిపి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎసిపి కార్యాలయంలో సిద్దిపేట నూతన ఎసిపి గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ క మిషనర్ ఎన్. శ్వేతను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సిపి నూతన ఎసిపిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. కేతిరెడ్డి సురేందర్ రెడ్డి 1998 సంవత్సరంలో ఎస్‌ఐగా పోలీస్ డి పార్ట్మెంట్‌లో అరంగేట్రం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేశారు, 2010 సంవత్సరంలో సిఐగా ప్రమోషన్ పొంది ఉమ్మడి మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు. ఈ సంవత్స రం 22-06-2023 ప్రమోషన్ పొంది సిద్దిపేట నూతన ఎసిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భ ంగా ఎసిపి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, గారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సేవలు అందిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News