- Advertisement -
ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులను నవ్వుల వర్షంతో ముంచెత్తేందుకు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. గీతానంద్-, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యువతను ఆకర్షించే కథాంశంతో తెరకెక్కుతోంది. సినిమా పోస్టర్ చూస్తుంటే దాని ఫన్ ఎలిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఓ అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించ డం ఆకర్షణీయం గా ఉంది. ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా యువతలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
- Advertisement -