Monday, December 23, 2024

గొప్పగా చదువుకొని మంచిస్థాయిలో ఉండటం అభినందనీయం

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: గొప్పగా చదువుకొని మంచి స్థాయిలో ఉండటం అభినందనీయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1983_84లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 ఏళ్ల తరువాత ఎక్కడైతే చదువుకున్నారో అదే పాఠశాలలో కలుసుకొని పూర్వ జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం సంతోషకరమని, ప్రతీ ఒక్కరూ గొప్పగా చదువుకొని మంచిస్థాయిలో ఉండటం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే ఆయన విద్యార్థి దశలోకి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ దామోదర్ యాదవ్, బోగి సువర్ణ సురేష్, కైలాష్ యాదవ్, ఇనుముల మల్లేశం, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News