Monday, December 23, 2024

నూతన పార్లమెంటు భవనం ‘బేకార్’: నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ఆవిష్కరణకు ఇంకా ఒక్క రోజే ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంటు భవనం అవసరమేమొచ్చిందని ఆయన అన్నారు. పాత పార్లమెంటు భవనం చారిత్రకమైనదని ఆయన తెలిపారు. ‘కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కరణ కార్యక్రమానికి పోవడం బేకార్’ అన్నారు. ‘అధికారంలో ఉన్న వారు చరిత్రనే మార్చేస్తారు అని నేను ఇదివరకే అన్నాను’ అని ఆయన హిందీలో తెలిపారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల్లో, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీల్లో నితీశ్ కుమార్ జెడి(యూ) కూడా ఉంది.

నితీశ్ కుమార్ నేటి ‘నీతి ఆయోగ్ సమావేశం’ను కూడా బహిష్కరించారు. ‘నేడు నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో, రేపు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్థమే లేదు’ అని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News