అమరావతి: ప్రేమకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవు. మనసులు ఒక్కటైతే చాలు ఏ దేశం నుంచైనా పెళ్లి చేసుకోవడానికి ప్రేమ జంటలు రెడీ అవుతున్నారు. గుంటూరు అమ్మాయి, బెల్జియం యువకుడు గ్రాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు పెద్దలను ఒప్పించి అంగరంగా వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
గుంటూరులోని లాలుపురం గ్రామానికి చెందిన ఆములోతు నరసింహారావు, కనకలక్ష్మి దంపతులకు పుష్పలత అనే కుమార్తె ఉంది. బిటెక్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ప్రాజెక్టు వర్క్ కోసం బెల్జియం వెళ్లారు. వెస్ట్ ప్లాండర్స్‌కు చెందిన క్రిష్ పోలేంటి అనే యువకుడు అక్కడ పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. క్రిష్ తల్లిదండ్రులు జోజెఫ్, మార్లిన్, పుష్పలత కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో గుంటూరులో పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. గ్రామస్థులు, బంధువులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గుంటూరు అమ్మాయితో బెల్జియం అబ్బాయి పెళ్లి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -