Wednesday, January 22, 2025

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: బెల్లయ్య నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జాతీయ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని సర్వేలు హస్తానికి అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో హవేలీ నియోజవర్గానికి ఇంచార్జిగా ఉండి ప్రచారం చేశానని, అమిత్ షా, మోడి రెండు సార్లు సభకు ప్లాన్ చేసుకొని రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు.

Also Read: త్వరలో రెండవ విడుత దళిత బంధు…

తెలంగాణ నేతలు చాలామంది కర్ణాటకలో ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తెలంగాణలో ప్రచారం మొదలు కానుందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రెజ్లర్లపై చైర్మన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేని ప్రధాని కొనసాగుతున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News