Thursday, January 23, 2025

కుటుంబమంతా చూసేలా ‘స్వాతిముత్యం’

- Advertisement -
- Advertisement -

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం దసరా కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో హీరో గణేష్ మాట్లాడుతూ “నేను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పారు.

ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీకి కూడా కథ నచ్చింది. ఇది తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నేను కొత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా.. లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథలో వైవిద్యం ఉంది.

ఇది ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే హాస్యమే తప్ప కావాలని ఇరికించినట్లు ఎక్కడా ఉండదు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా వినోదాన్ని పంచుతుంది. ప్రేక్షకులు చిరునవ్వుతోనే థియేటర్ల నుంచి బయటకు వస్తారు. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం ‘నేను స్టూడెంట్’ అనే ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News