- Advertisement -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో బెల్లంకొండ నటిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా #BS11 అనే ప్రాజెక్టుపై బెల్లంకొండ సంతకం చేశారు. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో శ్రీరాముడు బాణం ఆకాశం వైపు ఎక్కు పెట్టగా తోలుబొమ్మలాట, అడవి, యాంటెన్నాటవర్, హార్నెట్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ బాలీవుడ్ లో చత్రపతి సినిమా చేసి మంచి ఊపులో ఉన్నాడు. కాస్త విరామం తీసుకొని టాలీవుడ్ లో బిజీ అయ్యాడు.
- Advertisement -