Sunday, September 8, 2024

400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ

- Advertisement -
- Advertisement -

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాని లెజెండరీ కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అధికారికంగా ప్రకటించారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి బిఎస్‌ఎస్12 ప్రతిష్టాత్మక చిత్రం.

ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో కల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపిస్తోంది.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు. గుడిపై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ మొత్తం డివైన్ వైబ్ కనిపించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడిని చూస్తున్నారు. పోస్టర్ అదిరిపోయింది. లుధీర్ బైరెడ్డి అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన, పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News