Saturday, November 16, 2024

ఎసిబి వలలో బెల్లంపల్లి 2టౌన్ ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

Bellampalli 2 Town SI in ACB net

రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టివేత
స్టేషన్ బేలు మంజూరు కోసం రూ.2 లక్షల డిమాండ్
పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసిపి అధికారులు

మంచిర్యాల : స్టేషన్ బేయిల్‌ను మంజూరు చేసేందుకు ఒక వ్యక్తి నుంచి బెల్లంపల్లి 2టౌన్ ఎస్‌ఐ ఏ.భాస్కర్‌రావు రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో ఎసిబి అధికారులు డబ్బులను ఎస్‌ఐ డ్రైవర్ రాజ్‌కుమార్‌కు ఇస్తుండగా రెడ్ హ్యాడెండ్ పట్టుకున్నారు. ఏసిబి డిఎస్‌పి భద్రయ్య, విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా బాషాపేట చెందిన అల్లె సత్యనారాయణ, అల్లె వేణులు వారి లారీ ఆర్‌సి పత్రాలను మారుస్తూ పలు ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు తీసుకొని మోసం చేశారన్నారు. దీంతో పలువురు పైనాన్స్ కంపెనీల నిర్వాహకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అల్లె సత్యనారాయణ, అల్లె వేణులపై బెల్లంపల్లి 2టౌన్ ఎస్‌ఐ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు విషయంలో స్టేషన్ బేలు కోసం 2టౌన్ ఎస్‌ఐ భాస్కర్‌రావు మొదట నిందితుల నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్నారు.

దీంతో రూ.1.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదురగా సత్యనారాయణ కొడుకు అల్లె నవీణ్ ఎస్‌ఐ రూ.2 లక్షలు లంచం అడుగుతున్నారని చెప్పడంతో నవీణ్ ఏసిబి అధికారులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీంతో బుధవారం డబ్బులు తీసుకువచ్చి మొదట ఎస్‌ఐని కలిసాడని అయితే డబ్బులు పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వవద్దని కాల్‌టెక్స్ లోని సూపర్‌మార్కెట్ వద్ద ఉండాలని తన ప్రైవేట్ డ్రైవర్ రాజ్‌కుమార్‌ను పంపిస్తానని చెప్పాడని పేర్కొన్నారు. ఈమేరకు ఎస్‌ఐ డ్రైవర్‌కు రూ.1.20 లక్షలు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని నగదును స్వాధీనం చేసుకొని ఎస్‌ఐతో పాటు అతని డ్రైవర్‌ను కరీంనగర్ ఏసిబి కార్యాలయానికి తరిస్తామని విచారణ పూర్తి చేసి ఏసిబి కోర్టులో హజరు పరుస్తామని తెలిపారు. ఈసమావేశంలో ఏసిబి సిఐలు సునీల్, సంజీవ్, జానిండి, తిరుపతిలు పాల్గొన్నారు. కాగా ఇటీవలి కాలంలో వరుసగా పోలీస్ అధికారులు ఏసిబి అధికారులకు పట్టుబడడం పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది.

Bellampalli 2 Town SI in ACB net

Bellampalli 2 Town SI in ACB net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News