Tuesday, September 17, 2024

త్వరలో బెల్ట్ షాపులు మూసివేత ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులను మొత్తంగా బంద్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. కాంగ్రెస్ మే నిఫెస్టోలో పెట్టినట్లుగా నే రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేయించేందుకు ఎక్సై జ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం లో మొత్తం 2,620 వైన్స్‌లతో పాటు 1,800 బార్ అండ్ రెస్టారెం ట్లు ఉన్నాయి. ఈ వైన్ షా పులకు అనుబంధంగా గ్రా మాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉండ గా ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులుండగా, రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే బెల్ట్ షాపులను బంద్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంవత్సరానికి సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదా యం ఈ శాఖ ద్వారా వస్తుంది. అయితే ఈ బెల్టుషాపుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
బె

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News