Monday, December 23, 2024

వన్డేలకు స్టోక్స్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించాడు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం తాను సంప్రదాయ టెస్టు క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు వివరించాడు. ఇక కెప్టెన్సీతో తన బాధ్యత మరింత పెరిగిందన్నాడు. ఇలాంటి స్థితిలో వన్డేలకు తగిన న్యాయం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నాడు. దీంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మేలని భావిస్తున్నట్టు వివరించాడు. ఇక మంగళవారం దక్షిణాఫ్రికాతో ఆడేదే తన కెరీర్‌లో చివరి వన్డే అని స్పష్టం చేశాడు. ఇదిలావుండగా 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ట్రోఫీని అందించడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్టోక్స్ కెరీర్‌లో 104 వన్డేలు ఆడి 2919 పరుగులు చేశాడు. అంతేగాక 74 వికెట్లు పడగొట్టాడు.

Ben Stokes Announced retire from International ODIs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News