రాజ్‌కోట్: మూడు టెస్టు మ్యాచ్‌లో భారత చేతిలో ఇంగ్లాండ్ జట్టు భారీ ఓటమిని చవిచూడడంతో డిఆర్‌ఎస్‌లో అంపైర్స్ కాల్‌పై ఆ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు వెనుదిరిగాడు. అంపైర్ ఔట్ అని ప్రకటించగానే క్రాలీ డిఆర్‌ఎస్‌కు వెళ్లాడు. డిఆర్‌ఎస్‌లో మాత్రం బంతి వికెట్లను మిస్ అయినట్టు రిప్లేలో కనిపించిందన్నాడు. బంతి స్టంప్స్‌కు తగలకపోయిన అంపైర్స్ కాల్ అని వచ్చిందన్నారు.
అంపైర్స్ కాల్‌తో తికమక అయ్యానని, హాక్-ఐ సంస్థ నుంచి తమకు క్లారిటీ కావాలని స్టోక్స్ డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఓలీ పోప్ ఔట్ విషయంలోనూ ఇదే జరిగిందని విచారణ వ్యక్తం చేశాడు. డిఆర్‌ఎస్‌లో అంపైర్స్ కాల్ విషయం చాలాసార్లు వివాదాస్పదంగా మారింది. డిఆర్‌ఎస్‌లో ఔట్, నాటౌట్ రెండు ఉండాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ అంపైర్స్ కాల్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తీసేయాలని డిమాండ్ చేశాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.