ముంబై : ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్‌స్టోక్స్ వచ్చే ఐపిఎల్‌కు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలె ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ మినహా మిగతా వాటిలో తేలిపోయి న స్టోక్స్ ఫామ్‌లేమితో తంటాలు పడుతున్నాడు. దీంతో అత ను ఐపిఎల్ 2024లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి తెలియజేయగా అందుకు వారు సమర్ధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఐపిఎల్‌కు ముందు భారత్‌త్ ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్, అనంతరం టి20 వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. దీంతో బిజీ షెడ్యూల్ అతనిపై ఒత్తిడి ఉంటుందని అందుకుమ మేం సమర్ధిస్తామని వారు పెర్కొన్నారు.
గజరాత్ టైటాన్‌కు షాక్..
గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. దీంతో అతనికి ఐదు నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరం ఉంటుంది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌కు దూరం కానున్నాడు. ఐపిఎల్ రషీద్ గుజరాత్ టైటాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక రషీద్ ఖాన్ దూరమైతే ఆ జట్టుకు పెద్ద షాక్ అనే చెపొచ్చు.